Horoscope Today: ఈ రాశివారికి బాకీలు వసూలవుతాయి.

Horoscope Today: ఈ రాశివారికి బాకీలు వసూలవుతాయి.
Horoscope Today: ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఈ విధంగా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| సోమవారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం | సూర్యోదయం : 5.36| సూర్యాస్తమయం సా.6.34| తిథి శు.దశమి రా.7.32 వరకు తదుపరి ఏకాదశి మంగళవారం వరకు|నక్షత్రం విశాఖ రా.08.44 వరకు| తదుపరి అనురాధ|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 09.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.41 నుంచి 02.11 వరకు | దుర్ముహూర్తం ఉ.12.30 నుంచి 01.25 వరకు | అమృతఘడియలు ప.12.45 నుంచి 2.15 వరకు

ఈ రోజు రాశి ఫలాలు


మేషరాశి: ఈ రాశివారు ఈ రోజు ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు వస్తాయి.

వృషభరాశి: ఈ రాశివారికి ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి.

మిథునరాశి: ఈ రాశివారు ఈ రోజు కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు విశేష కీర్తి.

కర్కాటకరాశి: ఈ రాశివారు పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహరాశి: చర్చలు ఫలిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్యారాశి: ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంఘంలో ఆదరణ. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

తులారాశి: ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృశ్చికరాశి: ఈ రాశివారు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సురాశి: ఈ రాశివారు శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో విజయం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరరాశి: ఈ రాశివారు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

కుంభరాశి: ఈ రాశివారు పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగులకు బదిలీలు.

మీనరాశి:ఈ రాశివారు వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.

Tags

Read MoreRead Less
Next Story