Horoscope Today: ఈ రాశివారు కొత్త రుణాలు చేస్తారు... ప్రయాణాలు వాయిదా...!

Horoscope Today: ఈ రాశివారు  కొత్త రుణాలు చేస్తారు... ప్రయాణాలు వాయిదా...!
Horoscope Today: నూతన పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. ఇంటర్వ్యూలు సంతోషం కలిగిస్తాయి. ఆకస్మిక వస్తులాభాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం.

బుధవారం, ఆగష్టు 25, 202, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - వర్ష ఋతువు, శ్రావణ మాసం - బహుళ పక్షం, తిధి:తదియ సా4.34 తదుపరి చవితి, వారం:బుధవారం (సౌమ్యవాసరే), నక్షత్రం:ఉత్తరాభాద్ర రా10.10, తదుపరి రేవతి, యోగం:ధృతి ఉ8.10 తదుపరి శూలం, కరణం:విష్ఠి సా4.34 తదుపరి బవ తె4.56, వర్జ్యం:ఉ7.09 - 8.49, దుర్ముహూర్తం:ఉ11.37 - 12.27, అమృతకాలం:సా5.09 - 6.49, రాహుకాలం:మ12.00 - 1.30, యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00, సూర్యరాశి:సింహం ||, చంద్రరాశి:మీనం, సూర్యోదయం: 5.47 || సూర్యాస్తమయం:6.18

మేషం: నూతన పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. ఇంటర్వ్యూలు సంతోషం కలిగిస్తాయి. ఆకస్మిక వస్తులాభాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉత్సాహం.

వృషభం: కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. కృషి ఫలించదు. కార్యక్రమాలలో జాప్యం. రావలసిన బాకీలు అందవు. ఆస్తి విషయాల్లో వివాదాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో విభేదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం: రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహం: ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. బంధువుల ద్వారా శుభవార్తలు. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులే సమస్యలు సృష్టి్టస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు,ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. భూవివాదాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో పనిభారం. దైవదర్శనాలు.

వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కొన్ని బాకీలు అందుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు. దేవాలయ దర్శనాలు.

ధనుస్సు: ఆస్తి ఒప్పందాలు. వస్తులాభాలు. ఆదాయం పెరుగుతుంది. ధార్మిక చింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహ, వాహనయోగాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

మకరం: ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో కొంత నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పనిభారం.

కుంభం: విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి.

మీనం: కుటుంబసభ్యులతో వైరం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఆందోళన. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం

Tags

Read MoreRead Less
Next Story