Horoscope Today: ఈ రాశివారికీ ఆకస్మిక ధనలాభం..!

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.చవితి సా.5.19 వరకు, తదుపరి పంచమి నక్షత్రం రేవతి రా.11.41 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం ఉ.10.55 నుండి 12.35 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుండి 10.46 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.46 వరకు అమృతఘడియలు... రా.9.05 నుండి 11.00 వరకు.
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యం.
వృషభం: కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా. శ్రమాధికం. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.
మిథునం:ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. వృథా ఖర్చులు. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం:ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. బ«ంధువులతో మాటపట్టింపులు.
కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దూరప్రయాణాలు. ఉద్యోగులకు గందరగోళం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన.
మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు. సన్నిహితులు సహాయపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు.
కుంభం: రుణఒత్తిడులు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.
మీనం: ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com