Telugu Horoscope Today : ఈ రాశివారికి వ్యవహారాలలో విజయం... ఆప్తుల నుంచి శుభవార్తలు..!

శ్రీ ప్లవ నామ సంవత్సరం, బుధవారం, డిసెంబర్ 8, 2021, దక్షిణాయనం - హేమంతఋతువు, మార్గశిర మాసం - శుక్ల పక్షం, తిధి :పంచమి తె3.110ని.వరకు, వారo:బుధవారం (సౌమ్యవాసరే), నక్షత్రం:శ్రవణం తె4.41ని. వరకు, యోగం:ధృవం రా7.16 తదుపరి వ్యాఘాతం, కరణంబవ సా4.04 వరకు తదుపరి బాలువ తె3.11, వర్జ్యం:ఉ9.35 - 11.06, దుర్ముహూర్తం:ఉ11.30 - 12.14, అమృతకాలం:సా6.45 - 8.16, రాహుకాలం:మ12.00 - 1.30, యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00, సూర్యరాశి:వృశ్చికం || చంద్రరాశి: మకరం సూర్యోదయం:6.22 || సూర్యాస్తమయం:5.22
మేషం : కొత్త రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. పనులు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
వృషభం : పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
మిథునం : కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం : బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
సింహం : ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కన్య : బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.
తుల : వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికం : రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, మిత్రులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు. అనారోగ్యం.
ధనుస్సు : కుటుంబంలో సమస్యలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.
మకరం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ముఖ్య పనులు సజావుగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కుంభం : చేపట్టిన వ్యవహారాలలో పురోగతి. ఆస్తులు కొంటారు. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మీనం : శుభవర్తమానాలు అందుతాయి. కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com