Horoscope Today: ఈ రాశివారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు

Horoscope Today:  ఈ రాశివారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు
Horoscope Today: ఈ రోజు వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం| శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.44| సూర్యాస్తమయం సా.6.27| తిథి శు. షష్టి ప. 12.08 వరకు తదుపరి పంచమి| నక్షత్రం చిత్ర ఉ.8.13 వరకు |రాహుకాలం ప. 3.00 నుంచి 04.00 వరకు| యమగండం ఉ. 09.00 నుంచి 10.30 వరకు| వర్జ్యం ప.01.53 నుంచి 02.28వరకు| దుర్ముహూర్తం 08.17 నుంచి 9.07 వరకు పున: రా.10.55 నుంచి 11.45 వరకు | శుభసమయం ఉ.10.35 ని.

మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిశోధనలపై ఆసక్తి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

మిథునం: కొన్ని వ్యవహారాలు మందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: నిరుద్యోగుల యత్నాలు కొంత అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: కొత్త రుణాల కోసం యత్నిస్తారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

తుల: కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు. ధనవ్యయం. బంధువర్గంతో అకారణంగా వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకుల పరుస్తాయి.

వృశ్చికం: బంధువులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక లావాదేవీల్లో మరింత పురోగతి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి.

ధనుస్సు: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి.

మకరం: వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మీనం: ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ధన, వస్తులాభాలు. అంచనాలు నిజం కాగలవు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగస్తులకు విజయాలు.

Tags

Next Story