Horoscope Today: ఈ రాశి వారికి బంధువులతో విభేదాలు
ఈరోజు రాశిఫలాలు
మేషం: కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. శుభవార్తా శ్రవణం. రాబడి పెరిగి రుణాలు తీరుస్తారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు.
వృషభం: అనుకోని ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు. రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. పనులలో ఆటంకాలు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు.
మిథునం: ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. ఆలయ దర్శనాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అసంతృప్తి.
కర్కాటకం: కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వాహనాలు,ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో మరింత పురోగతి.
సింహం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ,ఆరోగ్యసమస్యలు. నిర్ణయాలలో నిదానం పాటించండి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు .
కన్య: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు చిక్కులు తొలగి ఊరట చెందుతారు.
తుల: బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు పొందుతారు.
వృశ్చికం: ప్రయాణాల్లో ఆటంకాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. నిర్ణయాలలో నిదానం అవసరం. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార లావాదేవీలలో మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాల్లో పనిభారం తప్పదు.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటాబయటా సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం
మకరం: ముఖ్యమైన పనుల్లో విజయం. ఆస్తిలాభ సూచనలు. బంధుమిత్రులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి..
కుంభం: వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాబడి పెరిగి అప్పులు తీరతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు.
మీనం: ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. ఆలయ దర్శనాలు. బంధువులతో విరోధాలు. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com