Horoscope Today: ఈ రాశివారికి బాకీలు వసూలవుతాయి..

Horoscope Today: ఈ రాశివారికి బాకీలు వసూలవుతాయి..
Horoscope Today: వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| సోమవారం| శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.46| సూర్యాస్తమయం సా.6.24| తిథి శు. అష్టమి ఉ.7.28 వరకు తదుపరి నవమి నక్షత్రం అనురాధ రా.తె3.30 |రాహుకాలం ఉ. 7.00 నుంచి 09.00 వరకు| యమగండం ఉ. 10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం ఉ.08.53 నుంచి 10.24వరకు| దుర్ముహూర్తం 12.31 నుంచి 1.21 వరకు పున: మ.03.05 నుంచి 03.52 వరకు | శుభసమయం రా.07.15 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన ఉద్యోగయోగం.

వృషభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరాశ. ఆలయాలు సందర్శిస్తారు..

మిథునం: నూతన వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ధనలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో గందరగోళం నుంచి బయపడతారు.

కర్కాటకం: రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో విరోధాలు. పనులు మ«ధ్యలోనే విరమిస్తారు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు చేపడతారు.

సింహం: అనుకున్న ఆదాయం సమకూరుతుంది. మిత్రుల కీలక ఆహ్వానం. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల: కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు.

వృశ్చికం: ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో వివాదాలు. శ్రమాధిక్యం. కళాకారులకు కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు: ఉద్యోగయత్నాలు కొంత ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. బంధువులతో సమస్యలు పరిష్కారం. దైవర్శనాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు.

మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి. ఆహ్వానాలు అందుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాల విస్తరణ యత్నాలు సఫలం. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుంభం: ఆదాయానికి మించి ఖర్చులు. పనులు ముందుకు సాగవు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగులకు పనిభారం.

మీనం: బంధువుల నుంచి విమర్శలు. కుటుంబసమస్యలు ఎదురుకావచ్చు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. దూరప్రయాణాలు.

Tags

Next Story