Telugu Horoscope Today : ఈ రాశివారికి ధనవ్యయం... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు...!

Telugu Horoscope Today :  ఈ రాశివారికి ధనవ్యయం... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు...!
Telugu Horoscope Today : పనులు పూర్తి. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పోటీపరీక్షల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.

Telugu Horoscope Today : శుక్రవారం, నవంబర్ 19, 2021, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - శరదృతువు, కార్తీక మాసం - శుక్ల పక్షం, తిధి:పౌర్ణమి మ12.56వరకు, తదుపరి కార్తీక బహళ పాడ్యమి, వారం:శుక్రవారం (భృగువాసరే), నక్షత్రం:కృత్తిక తె3.43 వరకు, యోగం:పరిఘము తె4.00వరకు, కరణం:బవ మ12.56 తదుపరి బాలువ రా1.55 ఆ తదుపరి కౌలువ, వర్జ్యం: మ2.32 - 4.17, దుర్ముహూర్తం: ఉ8.24 - 9.08 & మ12.07 - 12.52, అమృతకాలం:రా1.04 - 2.50, రాహుకాలం:ఉ10.30 - 12.00, యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30, సూర్యరాశి:వృశ్చికం || చంద్రరాశి: మేషం, సూర్యోదయం:6.10 || సూర్యాస్తమయం:5.21

మేషం : పనులు పూర్తి. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పోటీపరీక్షల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.

వృషభం : శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

మిథునం : ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం : కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల సలహాలతో ముందుకు సాగుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

సింహం : ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య : ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల : కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపారవృద్ధి. ముఖ్య నిర్ణయాలు.

వృశ్చికం : శ్రమ ఫలించదు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

ధనుస్సు : కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం : కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కుంభం : వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది. సోదరుల కలయిక.

మీనం : ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. దైవదర్శనాలు.

Tags

Read MoreRead Less
Next Story