Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
Horoscope Today: ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఇలా ఉన్నాయి

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం బుధవారం| శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.48| సూర్యాస్తమయం సా.6.12| తిథి శు. దశమి రా.3.56 వరకు తదుపరి ఏకాదశి, మృగశిర నక్షత్రం ఉ.11.30 వరకు |రాహుకాలం ఉ. 12.00 నుంచి 1.30 వరకు| యమగండం ఉ. 07.30 నుంచి 09.00 వరకు| వర్జ్యం రా.09.00 నుంచి 10.55వరకు| దుర్ముహూర్తం 11.34 నుంచి 12.21 వరకు | శుభసమయం ఉ.07.00 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: ప్రముఖులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ముందడుగు వేస్తారు.

వృషభం: ఆప్తుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న పనులు చక్కదిద్దడంలో ఆటంకాలు తొలగుతాయి. మీ సత్తా అందరూ గుర్తిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కళాకారులకు నూతనోత్సాహం.

మిథునం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత

అనుకూలత.

కర్కాటకం : దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు

సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. నూతన ఉద్యోగాలు పొందుతారు. దైవదర్శనాలు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుఉత్సాహాన్నిస్తాయి. వాహనయోగం.

తుల: చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. స్థిరాస్తి వివాదాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకులు.

వృశ్చికం: దూరప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు. బాకీలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. పనులు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కుంభం: చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆశయాలు నెరవేరతాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో సఖ్యత. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూల మార్పులు.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

Tags

Read MoreRead Less
Next Story