Horoscope Today: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది

Horoscope Today: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది
Horoscope Today: వివిధ రాశుల వారి దినఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం | దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం| తిథి శు.త్రయోదశి రా.8.11 వరకు, తదుపరి చతుర్దశి| నక్షత్రం ఉత్తరాషాఢ రా.9.47 వరకు, తదుపరి శ్రవణం|సూర్యోదయం : 5.46 | సూర్యాస్తమయం : 6.20| రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు| యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు| వర్జ్యం రా.1.41 నుండి 3.12 వరకు| దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.29 నుండి 1.19 వరకు| అమృతఘడియలు...ప.3.42 నుండి 5.14 వరకు| వరలక్ష్మీ వ్రతం

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.

వృషభం: కొద్దిపాటి కుటుంబసమస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పనిభారంతో సతమతం.

మిథునం: మిత్రులతో సఖ్యత. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు.

కర్కాటకం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అదనపు ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి.

సింహం: సన్నిహితులు,మిత్రుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు లాభాలలో నడుస్తాయి. ఉద్యోగాలలో కొంత ప్రోత్సాహం.

కన్య: బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

తుల: ఉద్యోగయత్నాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.. ధనలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి..

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో స్వల్ప విభేదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: ప్రయాణాల్లో మార్పులు. ధనవ్యయం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవచింతన. వ్యాపారాలలో కొంత ముందడుగు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మీనం: ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. భూ వివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

Tags

Read MoreRead Less
Next Story