Telugu Horoscope Today : ఈ రాశివారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. భూములు కొనుగోలు..!
Telugu Horoscope Today : శ్రీ ప్లవనామ సంవత్సరం.. వారం :శనివారం, దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం;బహుళపక్షం తదియ: రా. 12.15 తదుపరి చవితి కృత్తిక: రా. 8.31 తదుపరి రోహిణి వర్జ్యం: ఉ. 7.18 నుంచి 9.03 వరకు అమృత ఘడియలు: సా.5.52 నుంచి 7.38 వరకు దుర్ముహూర్తం: ఉ. 5.58 నుంచి 7.30 వరకు రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు సూర్యోదయం: ఉ.5-58, సూర్యాస్తమయం: సా.5-32
మేషం : కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.. వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం : ఈరోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు పెరుగుతాయి. . ఆకస్మిక ధనలాభం... ఆలయ దర్శనాలు.. కొత్త వ్యాపారాలు సిద్దిస్తాయి.
మిథునం: మిత్రులతో విబేధాలు. రాబడి అంతగా లేకున్నా అప్పులు చేస్తారు.. ఆలోచనలో స్థిరంగా ఉండవు.. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు.
కర్కాటకం : ఆప్తుల నుంచి కీలక సమాచారం. : దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధనప్రాప్తి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి
సింహం : అనుకున్న పనులు ముందుకు సాగవు.. మరింత భారం పడుతుంది.. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు.
కన్య : విలువైన వస్తువులు కొంటారు. భూలభాలు కనిపిస్తున్నాయి. వాహనయోగం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆటంకాలు తొలిగిపోతాయి.
తుల : ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారులకు లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు కొత్త సమస్యలు.. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు.
వృశ్చికం : ఆస్తి వివాదాల పరిష్కారం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలో ముందడుగు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. కార్యజయం. దైవదర్శనాలు.
ధనుస్సు : పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. సోదరులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగాలు, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. దైవదర్శనం అవసరం.
మకరం : పనుల్లో పురోగతి కనిపిస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు.. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. వాహనయోగం ఉంది.
కుంభం : ఆదాయం సంతృప్తినిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. అప్పులు పెరిగే అవకాశం ఉంది. దైవదర్శనాలు.
మీనం : ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది... వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం.. సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. జాగ్రత్త తప్పనిసరి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com