Horoscope Today: ఈ రాశివారికి పనుల్లో పురోగతి..ఆప్తుల నుంచి శుభవార్తలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం| శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.48| సూర్యాస్తమయం సా.6.20| తిథి శు. సప్తమి రా.9.28 వరకు తదుపరి అస్టమి, కృతిక నక్షత్రం సోమవారం ఉ.6.20 వరకు తదుపరి రోహిణి |రాహుకాలం సా. 4.30 నుంచి 6.00 వరకు| యమగండం ప. 12.00 నుంచి 01.30 వరకు| వర్జ్యం సా.09.00 నుంచి 10.55వరకు| దుర్ముహూర్తం 08.17 నుంచి 09.21 వరకు పున: మ.12.25 నుంచి 01.19 వరకు | శుభసమయం ఉ.07.30 ని.
ఈ రోజు రాశి ఫలాలు
మేషం: చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
వృషభం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: పనుల్లో పురోగతి. కుటుంబసమస్యలు తీరతాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
సింహం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కన్య: ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృశ్చికం: శ్రమ తప్పకపోవచ్చు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: పరిచయాలు విస్తృతమవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త పనులు చేపడతారు. ధనలాభం. పరిస్థితులు మరింత అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మకరం: బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com