Horoscope Today: ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు..!

Horoscope Today:  ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు..!
దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.

మంగళవారం,ఆగష్టు 31, 2021, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - వర్ష ఋతువు, శ్రావణ మాసం - బహుళ పక్షం, తిధి:నవమి రా2.00తదుపరి దశమి, వారం:మంగళవారం(భౌమ్యవాసరే), నక్షత్రం:రోహిణి ఉ9.01 తదుపరి మృగశిర, యోగం:హర్షణము ఉ9.16 తదుపరి వజ్రం, కరణం:తైతుల మ1.01 తదుపరి గరజి రా2.00 ఆ తదుపరి వణిజ, వర్జ్యం:మ3.11 - 4.58, దుర్ముహూర్తం:ఉ8.17 - 9.06 & రా10.51 - 11.37, అమృతకాలం:ఉ7.14వరకు & రా1.47 - 3.33, రాహుకాలం:మ3.00 - 4.30, యమగండం/కేతుకాలం:ఉ9.00 - 10.30, సూర్యరాశి:సింహం || చంద్రరాశి: వృషభం, సూర్యోదయం:5.48 || సూర్యాస్తమయం: 6.13

మేషం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆలయాల దర్శనాలు. ఉద్యోగాలలోవిశేష ఆదరణ.

వృషభం: బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చిక్కులు. పారిశ్రామికవేత్తలు పర్యటనలు వాయిదా వేస్తారు.

మిథునం:బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో స్థానచలనం.

కర్కాటకం: చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

సింహం: ఇంటర్వ్యూలు అందుతాయి. కార్యక్రమాలలో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

కన్య: పరపతి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.

తుల: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. ఆస్తిలాభ సూచనలు. బంధువులను కలుస్తారు. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి సహాయం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.

మకరం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో సామాన్యస్థితి. సోదరులతో కలహాలు.

కుంభం: కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మీనం: ముఖ్య కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం. కళాకారులకు గందరగోళం.

Tags

Read MoreRead Less
Next Story