Horoscope Today : ఈ రాశివారికి ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు..!
Horoscope Today : నేటి పంచాంగం :
శ్రీ ప్లవ నామ సంవత్సరం,దక్షిణాయనం - వర్ష ఋతువు,శ్రావణ మాసం - బహుళ పక్షం,తిధి:ద్వాదశి ఉ6.24 తదుపరి త్రయోదశి,నక్షత్రం:పుష్యమి సా5.09 తదుపరి ఆశ్రేష,యోగం:వరీయాన్ ఉ10.03 తదుపరి పరిఘము, కరణం:తైతుల ఉ6.24 తదుపరి గరజి మ2.21 ఆ తదుపరి వణిజ,వర్జ్యం :లేదుదుర్ముహూర్తం :ఉ5.49 - 7.26,అమృతకాలం:ఉ10.21 - 12.03,రాహుకాలం: ఉ9.00 - 10.30, యమగండం/కేతుకాలం:మ1.30 - 3.00,సూర్యరాశి:సింహం చంద్రరాశి:కర్కాటకం,సూర్యోదయం:5.49 || సూర్యాస్తమయం:6.11
నేటి రాశిఫలాలు :
మేషం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. విద్యార్థులకు శ్రమాధిక్యం.
మిధునం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
సింహం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య: పనులు మందగిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు ఫలితాలపై అసంతృప్తి చెందుతారు.
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు.
వృశ్చికం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన.
ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దైవదర్శనాలు.
మకరం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం.
కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com