Horoscope Today: ఈ రాశివారికి ఆత్మీయులతో మాటపట్టింపులు

Horoscope Today: ఈ రాశివారికి ఆత్మీయులతో మాటపట్టింపులు
Horoscope Today: వివిధ రాశుల వారి దినఫలాలు ఇలా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| సోమవారం| శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.44| సూర్యాస్తమయం సా.6.27| తిథి శు. పాడ్యమి సా.6.48 వరకు తదుపరి విదియ| నక్షత్రం అశ్లేష ప.గం. 10.34 వరకు తదుపరి మఘ |రాహుకాలం ఉ. 7.30 నుంచి 09.00 వరకు| యమగండం ప. 10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.10.48 నుంచి 12.23 వరకు| దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.21 వరకు పున: మ.3.02 నుంచి 3.52 వరకు | శుభసమయం ప.11.45 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.

వృషభం: ఈ రాశివారికి నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

మిథునం: ఈ రాశివారికి నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులకు శ్రీకారం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు.

కర్కాటకం: ఈ రాశివారికి కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు.

సింహం: ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆస్తి తగాదాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు.

కన్య: ఈ రాశివారికి పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

తుల: ఈ రాశివారు శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వ్యాపార విస్తరణయత్నాలు .. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

వృశ్చికం: ఈ రాశివారికి పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం.

ధనుస్సు: ఈ రాశివారికి బంధువర్గంతో తగాదాలు. వృథా ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మకరం: ఈ రాశివారికి ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: ఈ రాశివారికి వ్యయప్రయాసలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు చిక్కులు.

మీనం: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరు చేపట్టిన అన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తిలాభం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.

Tags

Next Story