chandi mata temple: అమ్మవారి ఆలయంలోకి ఎలుగుబంట్లు.. తీర్థప్రసాదాలు స్వీకరించి అడవిలోకి..

chandi mata temple: అమ్మవారి ఆలయంలోకి ఎలుగుబంట్లు.. తీర్థప్రసాదాలు స్వీకరించి అడవిలోకి..
chandi mata temple: ప్రతి రోజు భక్తులు సందర్శించినట్లే ఆ ఆలయంలోకి ఎలుగుబంట్లు వస్తాయి.. భక్తితో అమ్మవారిని దర్శించుకుంటాయి.

chandi mata temple: ప్రతి రోజు భక్తులు సందర్శించినట్లే ఆ ఆలయంలోకి ఎలుగుబంట్లు వస్తాయి.. భక్తితో అమ్మవారిని దర్శించుకుంటాయి. పూజారి ఇచ్చిన తీర్ధప్రసాదాలు స్వీకరించి తిరిగి అడవిలోకి వెళ్లిపోతుంటాయి. ఏరోజూ ఒక్క భక్తుడిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని చెబుతుంటారు స్థానికులు. మానవులు దైవాన్ని విశ్వసించినట్లే జంతువులు కూడా భగవంతుడిని పూజిస్తాయని ఈ దృశ్యం మనకు వివరిస్తుంది.

మాతా చండీ దేవాలయంలో ప్రతి రోజు జరిగే సంఘటన ఇది. ఇక్కడ ఎలుగుబంట్లు అమ్మవారి పట్ల గొప్ప విశ్వాసంతో వచ్చి పూజలు చేసి నైవేద్యం తీసుకుని వెళ్లిపోతాయి. ఈ మాతా చండీ ఆలయం మహాసముంద్ జిల్లాలోని బాగ్‌బహ్రా నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి మధ్యలో ఉంది.

నవరాత్రి రోజు నుండి ఈ ఆలయంలో భక్తుల రద్దీ ప్రారంభమవుతుంది. అయితే అదే సమయంలో ఎలుగుబంట్ల గుంపు కూడా ఆలయానికి వస్తుంది. ఎలుగుబంటి ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లి చండీ దేవి విగ్రహాన్ని పూజించిన తర్వాత ప్రసాదం తీసుకుంటాయి.

ఈ ఎలుగుబంట్ల మందలో ఒక మగ, ఒక ఆడ మరియు పిల్లలు ఉన్నాయి. ఆలయ పూజారి దీని గురించి వివరిస్తూ.. ఈ ఎలుగుబంటి కుటుంబం శాంతియుతంగా వచ్చి ప్రసాదం తీసుకుంటుంది. కొందరు భక్తులు తమ విశ్వాసంతో వాటికి పండ్లు ఫలహారాలు అందజేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఎలుగుబంట్లు ఎవరికీ హాని చేయవు.

ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వయంగా వెలసిందని చెబుతారు. ఆ తర్వాత తాంత్రికులు తమ యోగాభ్యాసం కోసం ఇక్కడికి వచ్చేవారు. వందల సంవత్సరాలనాటి ఈ పురాతన ఆలయం నేటికీ ప్రజల చేత పూజలందుకుంటోంది. ఈ ఎలుగుబంట్లు మాతృ దేవతచే ఆశీర్వదించబడినట్లు స్థానిక ప్రజలు నమ్ముతారు. నేటికీ ఈ సంఘటన ఖచ్చితంగా ప్రజలను ఆలోచించేలా చేస్తుంది.

Tags

Next Story