Corona Effect : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..!

Corona Effect : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..!
బుధవారం శ్రీవారిని కేవలం 5,084 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 2803 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు ఆలయాల పైన కూడా పడింది. అందులో భాగంగానే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం శ్రీవారిని కేవలం 5,084 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 2803 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటికే స‌ర్వద‌ర్శనం టోకెన్లు నిలిపివేసిన టీటీడీ.. కేవ‌లం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు మాత్రమే శ్రీవారి ద‌ర్శనం క‌ల్పిస్తోంది. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 35 లక్షల రూపాయలు వచ్చినట్టుగా టీటీడీ వెల్లడించింది. అటు ఏపీలో కూడా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూ విధించింది.

Tags

Next Story