Dasara Navaratri 2021: నవరాత్రి 7వ రోజు అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో.. మంత్ర మహిమ

Dasara Navaratri 2021: దుర్గా దేవి శక్తి స్వరూపిణి. నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తులు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరిస్తారు. 7వ రోజు దుర్గామాతను లక్ష్మి దేవిగా అలకరించి పూజిస్తారు. సంపద మరియు శ్రేయస్సును కోరుతూ భక్తులు దేవిని ఆరాధిస్తారు. ప్రతికూల లక్షణాలను అధిగమించి సానుకూల లక్షణాలను సూచిస్తుంది.
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ రూపంలో దర్శనమిస్తారు.
ప్రజలు నవరాత్రి ఏడవ రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తారు. ఆ రోజు ఆమెను గులాబీ రంగు చీరతో అలంకరిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పాలు, పంచదారతో చేసిన క్షీరాన్నం సమర్పిస్తారు.
మహాలక్ష్మీ మంత్రం
ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా I
మనుష్యో మత్ర్పసాదేన భవిష్యతి న సంశయా ఓం II
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com