Dasara Navaratri 2021: నవరాత్రి 8వ రోజు.. అమ్మవారు 'మహాగౌరి' రూపంలో..

Dasara Navaratri 2021: నవరాత్రి 8వ రోజు.. అమ్మవారు మహాగౌరి రూపంలో..
Dasara Navaratri 2021:

Dasara Navaratri 2021: నవరాత్రి 2021 రోజు 8: దసరా నవరాత్రుల్లో 8వ రోజన మహాగౌరిని పూజిస్తారు. మహాగౌరి దుర్గామాత యొక్క ఎనిమిదవ రూపం. మహాగౌరీ ఏకైక శక్తిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, ప్రపంచం మొత్తం ఆ తల్లి ప్రకాశంతో ప్రకాశిస్తుంది.

దుర్గా సప్తశతి ప్రకారం, శుశుడు నిశుంభ చేతిలో ఓడిపోయిన తరువాత, దేవతలు గంగా నది ఒడ్డున తమ రక్షణ కోసం మహాగౌరీ దేవిని ప్రార్థించారు. తల్లి యొక్క ఈ రూపాన్ని పూజించడం వలన శారీరక సామర్ధ్య అభివృద్ధితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ తల్లి రూపాన్ని అన్నపూర్ణ, ఐశ్వర్య ప్రదాయిని, చైతన్యమయి అని కూడా అంటారు.

మహాగౌరి పూజ విధానం:

ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తరువాత అమ్మవారికి పూజ చేయాలి. పువ్వులు అర్పించి ధ్యానించాలి. అమ్మవారి ముందు దీపం వెలిగించి జీవితాల్లో వెలుగులు పంచమని ప్రార్థించాలి. తల్లికి పండ్లు, నైవేద్యం సమర్పించి మంత్రం జపించాలి.

మహాగౌరి కథ:

పురాణాల ప్రకారం, పార్వతీ దేవి శివుడిని తన భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసింది. దేవి తపస్సులో మునిగిపోవడంతో ఆమె శరీరం దుమ్ముకొట్టుకుపోయి నల్లగా మారుతుంది. ఆమె తపస్సుకు కరిగిపోయిన శివుడు ప్రత్యక్షమై గంగాజలంతో తల్లి శరీరాన్ని కడుగుతారు. అప్పుడు గౌరి దేవి శరీరం ప్రకాశవంతంగా మారి మహాగౌరి దేవతగా ప్రసిద్ధి చెందుతుంది.

మహాగౌరి మంత్రం:

ధ్యాన మంత్రం:

వందే కామర్తే చంద్రఘకృత శేఖరా

సింఘ్రుధా చతుర్భుజ మహాగౌరీ యశస్వనీమ్

పూర్ణందు నిభాన గౌరీ సోమచక్రస్థితం అష్టమ్ మహాగౌరి త్రినేత్రం

వారాభీతికరన్ త్రిశూల్ దామృధారం మహాగౌరీ భజేమ్

పీతాంబర వస్త్ర నానలంకార్ భూషిత

మంజీర హర కింకిణి రత్నకుండల మండిత

Tags

Next Story