Deepavali Special: దీపావళి ప్రాశస్త్యం.. ఆ రోజు లక్ష్మీ దేవిని పూజిస్తే..
Deepavali Special: ఆకాశంలో వెలుగులు.. కళ్లు మిరుమిట్లు కొలిపే దీప కాంతులు. పుడమి అంతా పులకరించే పోయే అందం ప్రతి ఇల్లు దీప శోభితం. హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగ. బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ కుటుంబసభ్యులంతా కోలాహలంగా జరుపుకునే పండుగ దీపావళి. చెడుపై మంచి సాధించే విజయం దీపావళి.
హిందూ పురాణాలలోని ఒక ప్రధాన కథనంలో, దీపావళి అంటే శ్రీరాముడు, అతని భార్య సీతాదేవి మరియు సోదరుడు లక్ష్మణుడు 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు. రాక్షస రాజు రావణుడిని ఓడించిన రాముడికి గ్రామస్థులు స్వాగత, సత్కారాలతో హారతులు పడతారు. దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు.
మరొక కథ.. శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని ఓడించి తన రాజ్య ప్రజలు విడిపించిన రోజును దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి వేడుకల్లో భాగంగా రాక్షస రాజుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.
దీపావళి సందర్భంగా ప్రజలు హిందూ దేవత లక్ష్మీ దేవిని పూజిస్తారు. శ్రేయస్సు, సంపద, సంతానోత్పత్తికి దేవతగా ఆమెను కొలుస్తారు. దీపావళి రోజు రాత్రి తన భర్తగా అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరైన విష్ణువును ఎంచుకున్నట్లు దీపావళి కథ చెబుతుంది. లక్ష్మీ దేవిని పూలతో అలంకరించి దూప, దీప నైవేద్యాలతో, లక్ష్మీ అష్టోతరాలతో అమ్మవారిని నిష్టగా కొలిస్తే కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు. అమ్మవారిని కొలిచేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.. ఆ దేవిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి. అంతా మంచి జరగాలని ప్రార్థించాలి.
ఇతర సంస్కృతులలో, దీపావళి పండుగను కొత్త సంవత్సరంగా భావించి వేడుక చేసుకుంటారు. చాలా మంది దీపావళిని కొత్త ప్రారంభంగా భావిస్తారు. ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచడం, అలంకరించడం, కొత్త బట్టలు కొనుగోలు చేయడం వంటివి చేస్తారు.
వివాదాస్పద సరిహద్దు వెంబడి భారత్, పాకిస్తాన్ సైనికులు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. శత్రు సైన్యం అన్న విషయం ఆ ఒక్క రోజు మరిచిపోయి మిఠాయిలు పంచుకుంటారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com