బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల కష్టాలు!

బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల కష్టాలు!
వసంత పంచమి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని.... తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భారీగా చేరుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వసంత పంచమి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని.... తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భారీగా చేరుకున్నారు. అయితే తమకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. టీటీడీ వసతి గృహం, లాడ్జిల్లో రూమ్‌లు దొరకడం లేదని... కొన్ని లాడ్జిల్లో రూమ్‌లు ఉన్నా... ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసారి వాపోయారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story