Tirumala తిరుమల శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం

Tirumala తిరుమల శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం
X

శ్రీవారికి బెంగళూరు భక్తులు భారీ విరాళాలను సమర్పించారు. బుధవారం ఉదయం బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు శ్రీవారిని అలంకరించేందుకు గాను రూ.25 లక్షల విలువైన వజ్రం, వైజయంతితో పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు. ఈ ఆభరణాన్ని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

అలాగే బెంగళూరుకు చెందిన మరో భక్తుడు కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి టీటీడీకి భారీ విరాళం ఇచ్చారు. శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఆయన రూ.కోటి విరాళంగా అందజేశారు. ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను (డీడీ) టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

Tags

Next Story