అయ్యప్పలూ.. అలా చేయకండి స్వామీ.. : రైల్వే శాఖ విజ్ఞప్తి

అయ్యప్పలూ.. అలా చేయకండి స్వామీ.. : రైల్వే శాఖ విజ్ఞప్తి
నిబంధనలు అతిక్రమించిన వారిపై మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు.

అగ్గిపుల్లలు, అగరబత్తులు రైలు బోగీల్లో వెలిగించరాదని వక్షిణ మధ్య రైల్వే శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు విజ్ఞప్తి చేసింది. శబరిమల యాత్రికుల కోసం డిసెంబర్ 16 నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.

సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణీకులు రైల్వే శాఖతో సహకరించాలని కోరారు. బోగీల్లో ప్రయాణీకులు పూజలో భాగంగా కర్పూరం వెలిగించడం, అగరబత్తులు వెలిగించడం వంటివి చేయరాదని చెప్పారు. రైళ్లలో అగ్ని సంబంధిత వస్తువులు తీసుకెళ్లడం నిషేధం అని పేర్కొన్నారు.

రైల్వే భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు. భక్తులు కోవిడ్ ప్రోటోకాల్‌ను కూడా తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story