Vijayawada Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు.. శ్రీరాజరాజేశ్వరీ దేవీగా భక్తులకు దర్శనం..!

Vijayawada Indrakeeladri Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. విజయదశిమి సందర్భంగా ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవీగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అదిష్టాన దేవత శ్రీరాజరాజేశ్వరీ దేవీ రూపాన్ని దసరా రోజు దర్శించుకోవడం వల్ల సర్వశుభములు, అన్ని విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఉత్సవాలలో చివరి ఘట్టమైన తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. కృష్ణా నదిలో గంగా సార్వతి సమేత దుర్గా మల్లేశ్వరులు త్రిలోక సంచారం చేసే తెప్పోత్సవంకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడుసార్లు ప్రదక్షణగా సాగే ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తుతారు. అయితే కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉన్నందున, విహారాన్ని రద్దుచేసి, తీరంలోనే తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com