PURI: పూరీ ఆలయంపైన జెండా ఎత్తుకెళ్లిన గద్ద

X
By - Sathwik |14 April 2025 1:00 PM IST
పూరీ ఆలయంలో ఊహించని ఘటన జరిగింది. ఎంతో పరమ పవిత్రంగా భావించే ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోపురంపై ఉన్న జెండాను గద్ద నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సముద్రంవైపు వెళ్లిపోయింది. ఇది చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. కొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. పూరీకి వచ్చే భక్తులంతా తొలుత పతితపావన జెండా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆలయంలో జగన్నాథుడి దర్శనం కోసం వెళ్తారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు.ాోుతా
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com