Fasting: పౌర్ణమి రోజు ఉపవాసం.. బీపీ, షుగర్ ఉన్న వారి పరిస్థితి ఏంటి?

Fasting: ఒకవేళ ఉపవాసం ఉండాలని మనసుకు అనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి శక్తిని ఇచ్చే పండ్లు, జ్యూస్‌లు లాంటివి తీసుకోవాలి. శరీరం నీరసించే పరిస్థితిని తెచ్చుకోకూడదు. ఆత్మారాముడిని సంతృప్తి పరచకపోతే ఆ దేవుడు కూడా హర్షించడు.
భక్తులు భగవంతునికి దగ్గరగా ఉండడమే అసలైన ఉపవాసం. భగవన్నామ స్మరణ చేస్తూ, మంచి ఆలోచనలతో భక్తితో భగవంతుడిని ఆరాధిస్తే పరమశివుడు సంతుష్టుడవుతాడు. ఉపవాసం రోజు ఇవి తీసుకుంటే శరీరం నిస్సత్తువకు గురికాకుండా ఉంటుంది.
పండ్లు తినండి
మీరు ఉపవాసం ఉంటే, మీకు నచ్చిన పండ్లను తీసుకోవచ్చు. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా చేర్చవచ్చు. పండ్లలో విటమిన్లు, కాల్షియం, పొటాషియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచడానికి తోడ్పడతాయి. అవి మీ శరీరం డీహైడ్రేట్‌తకి గురికాకుండా చూస్తాయి.
డ్రై ఫ్రూట్స్ తినండి
బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌తో శక్తి వస్తుంది. గింజలను తీసుకోవడం ద్వారా, మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మీ శరీరానికి ఇలాంటి ఆహారం ద్వారా మంచి ఫుడ్ అందిస్తున్నారని గుర్తుంచుకోండి. మీరు బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు, ఎండుద్రాక్షలను రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇవి రోజంతా మిమ్మల్ని ఎనర్జీతో ఉండడానికి సాయం చేస్తాయి.
హైడ్రేటెడ్ గా ఉండండి
మీరు ఉపవాసం ఉన్నప్పుడు హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. ఎప్పుడూ నీళ్లతో నిండిన బాటిల్ మీ దగ్గర ఉంచుకోండి. ఎప్పటికప్పుడు సిప్ చేస్తూ ఉండండి. ఉపవాస సమయంలో మీరు మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లను కూడా తీసుకోవచ్చు.
విశ్రాంతి
మీరు ఉపవాసం ఉన్నప్పుడు, మీ శరీరం అంతర్గత అవయవాలను శుభ్రపరచడం ప్రారంభిస్తుంది. అందువల్ల సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరు విశ్రాంతితీసుకోనట్లయితే మీకు శక్తి కరువవుతుంది. తలతిరగడం లేదా తలనొప్పి వంటివి మిమ్మల్ని బాధిస్తాయి.
ఏది ఏమైనప్పటికి డాక్టర్ సూచనలు, సలహా మేరకు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com