వినాయకుడి వివాహం.. మనకు తెలియని నిజం

వినాయకుడి వివాహం.. మనకు తెలియని నిజం
విఘ్నాలు తొలగించే నాయకుడు వినాయకుడు.. తొలి పూజలందుకునే దేవుడు. గణేషుడి ఆహార్యం అందరికీ ఆశ్చర్యం.

విఘ్నాలు తొలగించే నాయకుడు వినాయకుడు.. తొలి పూజలందుకునే దేవుడు. గణేషుడి ఆహార్యం అందరికీ ఆశ్చర్యం. ఆయనకు చేసే పూజ కూడా ప్రత్యేకం. చిన్నారులకు ఎంతో ఇష్టమైన పండుగ వినాయకచవితి. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో వినాయకుడిని చూసి నేర్చుకోమని చెబుతుంటారు పెద్దలు.

తనను పూజించే భక్తులను గణేష్ ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. గణేష్ తల్లిదండ్రులు పార్వతి, శివుడు అనే విషయం అందరికీ తెలుసు. మరోవైపు, అతనికి ఇద్దరు భార్యలు రిద్ధి మరియు సిద్ధి. అయితే, ఇవి కాకుండా, అతనికీ ఓ పెద్ద కుటుంబం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తక్కువ మందికి మాత్రమే ఈ విషయాలు తెలుసు. ఈ రోజు మనం గణేష్ కుటుంబం గురించి తెలుసుకుందాం.

తొలి పూజలందుకునే వినాయకుని ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అతని కుటుంబం మొత్తానికి ఓ ఆలయం ఉంది. అంబాజీ పుణ్యక్షేత్రం గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఉంది. ఇది పురాతన దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో సహకుటుంబ సిద్ధి వినాయక ఆలయం ఉంది. ఇక్కడ గణేష్ తన మొత్తం కుటుంబంతో కలిసి భక్తుల పూజలందుకుంటారు. దేవాలయ పూజారి ముఖేష్ భాయ్ ప్రకారం, వినాయకుడి కుటుంబం పూజించబడే ప్రపంచంలోని ఏకైక ఆలయం ఇది అని తెలిపారు.

అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే వివాహం కాదే.. మరి గణేషుడికి చూడబోతే పెద్ద బొజ్జ, చాటంత చెవులు, తొండం, విరిగిన దంతం, ఏనుగు ముఖం.. ఏ అమ్మాయి అయినా ఎలా చేసుకుంటుంది.. అందంగా కనిపించాలి.. ఒడ్డు పొడుగూ బావుండాలి.. మరి గణేషుడికి పిల్లనెవరిస్తారు.. అందుకే అతన్ని వివాహం చేసుకోవడానికి ఏ అమ్మాయి సిద్ధంగా లేదు. దీంతో గణేశుడు కలత చెందాడు. నాకు లేని పెళ్లి వాళ్లు మాత్రం ఎందుకు చేసుకోవాలని ఈర్ష్యతో దేవతల వివాహానికి భంగం కలిగించమని తన వాహనం అయిన ఎలుకను ఆదేశించాడు.

వివాహం ఎక్కడ జరిగినా, ఎలుక అక్కడికి చేరుకుని అడ్డంకులను సృష్టించేది. దీంతో విసుగు చెందిన దేవతలు బ్రహ్మ దేవుడికి మొర పెట్టుకున్నారు. ఏదో ఒక ఉపాయం చేయమని అభ్యర్థించారు. అప్పుడు బ్రహ్మ ఇద్దరు కుమార్తెలు, రిద్ధి మరియు సిద్ధిని సృష్టించారు. వారిని గణేశుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ విధంగా, జ్ఞాన ప్రసాదిని అయిన రిద్ధి, విజయం సిద్ధించేందుకు తోడ్పడే సిద్ధిని గణేశుడు వివాహం చేసుకున్నాడు.

గణేష్ తల్లి- పార్వతి, తండ్రి- శివుడు.. కార్తికేయ గణేష్ సోదరుడు అని అందరికీ తెలుసు. అయితే కార్తికేయతో పాటు, జలంధర్, అయ్యప్ప మరియు భూమా కూడా గణేష్ సోదరులు.

ఇక గణేష్ సోదరి విషయానికి వస్తే - ఆమె పేరు అశోక సుందరి. ఆమెతో పాటు నాగకన్యగా పరిగణించబడే శివుడి ఇతర కుమార్తెలు జయ, విశార్, జంబరి, దేవ్ మరియు దోతాలి కూడా ఆయన సోదరీ మణులే. అశోక సుందరి శివపార్వతులకు జన్మించిన కుమార్తె అని పురాణ గ్రంధాల్లో పేర్కొన్నారు. ఈ కారణంగా గణేష్ సోదరి అశోక సుందరి అయింది.

గణేష్ భార్యలు- ఏకదంతుడికి ఇద్దరు భార్యలు రిద్ధి మరియు సిద్ధి అని మాత్రం తెలుసు. కానీ అతనికి మరో ముగ్గురు భార్యలు కూడా ఉన్నారు. వీరి పేర్లు తుష్టి, పుష్టి మరియు శ్రీ.

గణేష్ కుమారులు- మనం వినాయకుని కుమారుల గురించి మాట్లాడుకుంటే, అతని కుమారుడి పేరు శుభ్ మరియు లభ్.

గణేష్‌కి మనవళ్లు కూడా ఉన్నారన్న విషయం తెలిస్తే మరింత ఆశ్చర్యపోతాం.. గణేష్‌కి ఇద్దరు మనవళ్లు అమోద్ మరియు ప్రమోద్. ఈసారి ఎప్పుడైనా అటు వెళ్లినప్పుడు గణేశుడు కుటుంబ సమేతంగా ఉన్న ఆలయాన్ని సందర్శిద్దాం. పురాణ గ్రంధాల్లోని సమాచారం ప్రకారం ఈ వివరాలు తెలియపరచడం జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story