Lakshmidevi In Home : ఇల్లు ఇలా ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది.. !

Lakshmidevi: చిన్న ఇల్లైనా చూడముచ్చటగా ఉంటే బావుంటుంది.. అంటే ఆ ఇంట్లో వస్తువులను అమర్చుకునే తీరు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంట్లో వాళ్లు. లక్ష్మీ దేవికి కూడా అలాంటి ఇల్లు ఆవాస యోగ్యంగా ఉంటుంది.. కష్టపడిన సొమ్ము వృధాగా ఖర్చు కాదు.. అమ్మవారి అనుగ్రహంతో అదనంగాను సంపాదించే అవకాశమూ ఉంటుంది. విజయానికి, సంపదకు లక్ష్మీ దేవి ప్రతి రూపం. ప్రతి వ్యక్తి తన జీవితంలో సాధించాలనుకునే సంపద లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. అయితే ఆమెను నిలబెట్టుకోవడం అంత సులభం కాదు.
అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే, ఖచ్చితంగా మనలో ఉన్న కొన్ని ప్రతికూల లక్షణాలను వదిలించుకోవాలి.
అపరిశుభ్రత : పరిశుభ్రత గురించి పెద్దగా పట్టించుకోని వ్యక్తులలో మీరు ఒకరైతే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీ దేవి పరిశుభ్రంగా ఉండే ప్రదేశాలలో ఉంటుంది.
సోమరితనం : ఎటువంటి ప్రయత్నం చేయకుండా లక్ష్మీ దేవి మీ వద్దకు రావాలని ఆశిస్తే మీకు కచ్చితంగా నిరాశే ఎదురవుతుంది. కష్టపడి పనిచేయాలి. మీ ప్రయత్నం మీరు చేయాలి. సంధ్య కాల (సాయంత్రం) సమయంలో నిద్రపోవడం లక్ష్మీదేవి రాకకు ఆటంకం కలిగిస్తుంది.
నిస్తేజంగా ఉండకూడదు : నిస్సహాయత, నీరసం పూర్తిగా వదిలేయాలి. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, మీరు చురుకుగా ఉండాలి. చిరిగిపోయిన, వెలసి పోయిన బట్టలు ధరించవద్దు. ఉన్నంతలో శుభ్రమైన బట్టలు కట్టుకోవడానికి ప్రయత్నించాలి.
దురాశ: అత్యాశను వదిలించుకోండి.. మీ వద్ద ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి. అవసరం మరియు కోరిక మధ్య తేడాను గుర్తించడం నేర్చుకోవాలి. మీ నిర్విరామ ప్రయత్నమే మిమ్మల్ని లక్ష్మీ దేవి అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంది.
స్వార్థం : మీ వద్ద ఉన్న ధనంలో కొంత మొత్తాన్ని అవసరమైన వారితో పంచుకోవడంలో ఆసక్తి కనబరచకపోతే దేవత ఆగ్రహానికి గురవుతారు. మీరు నిస్వార్థంగా ఉన్నప్పుడు, మీరు కోరుకోక పోయినా సంపద మీ ఒడిని చేరుతుంది.
కోపం : మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీలోని మంచితనం లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com