గురు పౌర్ణమి సందర్భంగా రామకృష్ణ మఠంలో ఘనంగా ఏర్పాట్లు..!
By - Gunnesh UV |23 July 2021 3:15 PM GMT
గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 24న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఉంటుంది.
గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 24న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఉంటుంది. కొన్ని పుస్తకాలపై 20% దాకా డిస్కౌంట్ ఉంటుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రామకృష్ణ మఠం ప్రతినిధులు సూచించారు. మరోవైపు గురు పౌర్ణమి వేడుకలకు మఠంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. గురుపూర్ణిమ సందర్భంగా ఈ నెల 24న ఉదయం 7 గంటలకు విశేష పూజ, ఉదయం 8 గంటలకు భజనలు, ఉదయం 10:45కు హోమం, 11:15కు తెలుగులో ప్రసంగం ఉంటాయి. ఉదయం 11:40కి ముండకోపనిషత్తు నూతన పుస్తక ఆవిష్కరణతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12:05 నిమిషాలకు విశేష హారతి, సాయంత్రం 6:45కు ఆరాత్రికం ఉంటాయి. రాత్రి 7:15 నిమిషాలకు ప్రత్యేక భజనలుంటాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com