Ayyappa Prasadam: ఇంటికే అయ్యప్ప ప్రసాదం..

Ayyappa Prasadam: ఇంటికే అయ్యప్ప ప్రసాదం..
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్ప అరవణ ప్రసాదానికి కూడా అంతటి ప్రాముఖ్యం ఉంది.

Ayyappa Prasadam : శబరిమల ఆలయం నుండి పవిత్ర ప్రసాదాలతో కూడిన కిట్‌లను పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఇంటింటికి పంపిణీ చేస్తుంది. తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని ప్రసాదం లడ్డూకి ఎంత ప్రాముఖ్యం ఉందో శబరిమల అయ్యప్ప అరవణ ప్రసాదానికి కూడా అంతటి ప్రాముఖ్యం ఉంది. అయ్యప్పని దర్శించిన భక్తులు కచ్చితంగా ఈ ప్రసాదాన్ని అందరికోసం తెస్తారు. ప్రసాదం తమ వరకు చేరడం భక్తులు తమ భాగ్యంగా భావిస్తారు. కరోనా కారణంగా శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య తగ్గడంతో దేవస్థానం తపాలా శాఖ ద్వారా అరవణ ప్రసాదాన్ని భక్తులకు అందజేయాలని భావించింది.

భారతదేశంలోని అయ్యప్ప స్వామి భక్తులకు స్పీడ్ పోస్ట్ ద్వారా శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం బుకింగ్ మరియు డెలివరీ కోసం తపాలా శాఖ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా పోస్ట్ యొక్క ఇ-పేమెంట్ సిస్టమ్ ద్వారా భారతదేశంలోని ఏదైనా డిపార్ట్‌మెంటల్ పోస్ట్ ఆఫీస్‌లో ప్రసాదం బుకింగ్ చేయవచ్చు.

స్వామి ప్రసాదం" అనే కిట్‌లో ఉంది

అరవణ ప్యాకెట్ ఒకటి

నెయ్యి

పసుపు

కుంకుమ్

విభూతి

అర్చన ప్రసాదం.

కిట్ ఖరీదు రూ.450/-.

ఈ వస్తువులను అట్టపెట్టెలో ప్యాక్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా భక్తులకు చేరవేస్తారు. డెలివరీ సమయం దాదాపు 7 రోజులు ఉంటుంది.

ప్రసాదాన్ని ఆర్డర్ చేయడానికి మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి ఈ ఫారమ్‌ను నింపి, ఒక కిట్‌కు రూ.450/-తో పాటు కౌంటర్‌లో సమర్పించాలి. మీరు ఒకే అప్లికేషన్‌లో 10 కిట్‌ల వరకు ఆర్డర్ చేయవచ్చు. మీకు మరిన్ని కావాలంటే మీరు అదనపు ఫారమ్‌లను పూరించాలి. మీరు చేసే ఆర్డర్‌ల సంఖ్యకు గరిష్ట పరిమితి లేదు.

Tags

Next Story