Horoscope Today : ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది... శుభవార్తలు వింటారు..!
Horoscope Today : శ్రీ ప్లవ నామ సంవత్సరం,ఉత్తరాయణం - హేమంతఋతువు,పుష్య మాసం - శుక్ల పక్షం,తిధి:త్రయోదశి రా12.34 వరకు నక్షత్రం:మృగశిర రా11.29 వరకు యోగం:బ్రహ్మం మ3.13 వరకు,కరణం:కౌలువ ఉ11.29 వరకు,తదుపరి తైతుల రా12.34,వర్జ్యం:లేదు,దుర్ముహూర్తం:ఉ6.38 - 8.06,అమృతకాలం: మ1.44 - 3.30 రాహుకాలం:ఉ9.00 - 10.30,యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00 సూర్యరాశి:మకరం || చంద్రరాశి: వృషభం,సూర్యోదయం:6.38 |సూర్యాస్తమయం:5.40
మేషం : శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. బంధువుల కలయిక. ఇంటాబయటా చికాకులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
వృషభం : పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మిథునం : ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్పులు. కుటుంబసమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం : చేపట్టిన పనుల్లో విజయం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం : పరపతి పెరుగుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కన్య : మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనులలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
తుల : వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం : దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు : రుణాలు తీరతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
మకరం : వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం : దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి
మీనం : కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com