Karteeka Somavaram: కార్తీక మాసం రెండో సోమవారం.. శివనామస్మరణలో శైవ క్షేత్రాలు

Karteeka Somavaram: కార్తీక మాసం రెండో సోమవారం.. శివనామస్మరణలో శైవ క్షేత్రాలు

Karteeka Somavaram: కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ఇవాళ శివాలయాలన్నీ తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం సందడి నెలకొంది. ముఖ్యంగా ఏపీలోని ప్రముఖ క్షేత్రాలన్నింటికీ భక్తులు పోటెత్తుతున్నారు. పంచరామం, అమరాశ్వేరాలయం, ద్రాక్షరామ భీమేశ్వరాలయం తదితర ఆలయాలన్నీ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి.

ఇక పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కార్తీక మాస రెండో సోమవారం ప్రత్యేక పూజలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. కార్తీకమాసోత్సవాల్లో భాగంగా దీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు శ్రీశైల శైవ క్షేత్రానికి భక్తలు పోటెత్తారు..స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పర్శ దర్శనాన్ని రద్దు చేశారు..

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులంతా ఆలయాలకు పోటెత్తారు. శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారు మోగుతున్నాయి.పశ్చిమ గోదావరి జిల్లాలో వశిష్ట గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు.. భక్తుల శివ నామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. నరసా పురంలోని కపిల మల్లేశ్వర, అమరేశ్వర, విశ్వేశ్వర, ఏకాంబరేశ్వర స్వామి వార్ల ఆలయాలకు వేకువ జాము నుంచే భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తల‌ దీపారాధన చేస్తున్నారు. ఆ శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

ఇటు పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. పంచారామ క్షేత్రం క్షీర రామ లింగేశ్వర స్వామి స్వామి వారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. శివయ్య కు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని శివాలయాలన్నీ శివ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి.

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా లోని గునుపూడి లో నెలకొన్న శ్రీ ఉమా మహేశ్వర జనార్ధన స్వామి ఆలయం పంచరామ క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైనది.. ఇక్కడ స్వామి వారి లింగ రూపం రంగులు మారుతుంటుంది.. కార్తీక మాస రెండో సోమ వారం నేపధ్యంలో స్వామి వారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. శివయ్య కు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని శివాలయాలన్నీ శివ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి.

Tags

Next Story