karthika pournami: కార్తీక పౌర్ణమి విశిష్టత.. అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా..

karthika pournami: దేశవ్యాప్తంగా హిందువులు కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక పౌర్ణమి పండుగను హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లోని పవిత్రమైన కార్తీక మాసంలో జరుపుకుంటారు. శివుడిని, విష్ణువుని ఏకకాలంలో ఆరాధించే ఏకైక మాసం కార్తీకం. పౌర్ణమి రోజున భక్తులు ఆలయాలను సందర్శిస్తారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి పరమశివుడిని భక్తితో కొలుస్తారు.
కార్తీక పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత
ఈ రోజున, భక్తులు నదీ స్నానం ఆచరిస్తారు. శివుడిని ప్రార్థించి ఉపవాసం ఉంటారు. శివునికి పాలు, తేనెతో రుద్రాభిషేకం చేసే సంప్రదాయం కూడా ఉంది. సత్య నారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడానికి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పౌర్ణమి పరిగణించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయంలో జాతర నిర్వహించబడుతుంది. ఈ జాతరను ఒరిస్సాలో కూడా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో కార్తికేయుడిని చాలా భక్తితో పూజిస్తారు. కటక్‌లో కార్తీక పూర్ణిమ నాడు భారీ కార్తికేశ్వర విగ్రహారాధన చేస్తారు. కార్తీక పూర్ణిమ నాడే శ్రీ గురునానక్ పుట్టిన రోజు కూడా కావడంతో సిక్కులు ఎంతో భక్తితో ఈ పండుగను జరుపుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com