వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీక శోభ

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీక శోభ

తెలంగాణ హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కోవిడ్‌ నిబంధనల మేరకు గర్భాలయంలో పూజలు రద్దు చేసి లఘు దర్శనం అమలు చేస్తున్నారు. ఆలయంలో నిత్య కళ్యాణం, చండీ హోమం, మహాలింగార్చన, శ్రీసత్యనారాయణ వ్రతాలు వంటి ప్రత్యేక పూజలు మినహా... ఆర్జిత సేవలను రద్దు చేశారు.

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో కొలువైయున్న స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి కార్తీక సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. పంచామృతాలతో శివయ్యకు అభిషేకం నిర్వహించారు.Tags

Read MoreRead Less
Next Story