TTD : తిరుమల రథసప్తమి దర్శనాలపై కీలక ప్రకటన

TTD : తిరుమల రథసప్తమి దర్శనాలపై కీలక ప్రకటన

ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు పై టీటీడీ సమీక్ష నిర్వహించింది. టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఈ సమావేశం జరిగింది. రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇస్తారు. ఈ వేడుకలను చూసేందుకు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో ఆరోజు సిఫారసు లేఖల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సర్వదర్శనం టోకెన్ల రద్దు చేయనున్నారు. భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ల ద్వారా అనుమతి ఇవ్వనున్నారు. మాడవీధుల్లో భక్తుల రక్షణకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రథసప్తమి రోజు భక్తుల కొరకు 8 లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది.

Next Story