వైభవంగా యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..!

వైభవంగా యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..!
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 22న స్వస్తివచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.. 28వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగుస్తాయి. నాలుగో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. అర్చకులు స్వామి వారికి ఉదయం హవనం, హోమం, తిరుమంజనం.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని హనుమంత వాహనంపై నవమనోహరంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. రాత్రికి స్వామి.. అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story