శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రతిరోజు శివపార్వతుల రుద్రహోమాలతోపాటు.. పురవీధుల్లో వివిధ వాహన సేవలతో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఇవాళ భృంగి వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి గ్రామోత్సవాల్లో భాగంగా భృంగి వాహనంపై విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శన మివ్వనున్నారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణపతి పూజ, శివసంకల్పం, చండీశ్వర పూజ, కంకణధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, హోమంతోపాటు విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతిరోజు శివపార్వతుల రుద్రహోమాలతోపాటు.. పురవీధుల్లో వివిధ వాహన సేవలతో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story