Makara Jyothi : శబరిమలలో భక్తులకు మకరజ్యోతి దర్శనం

Makara Jyothi : శబరిమలలో భక్తులకు మకరజ్యోతి దర్శనం
Makara Jyothi : శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే మకరజ్యోతి దర్శనమిచ్చింది.

శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నంబలమేడు కొండల్లో మకరజ్యోతి కనిపించింది. అయ్యప్ప నామస్మరణతో శబరిమల మార్మోగింది. తిరు ఆభరణాల అలంకరణ అనంతరం జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తులు సన్నిధానానికి భారీగా చేరుకుంటున్నారు. పంబ, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో జ్యోతిని చూసేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మకరజ్యోతిని దర్శించుకుంటే అయ్యప్పస్వామి భాగ్యం కలుగుతుందని, జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు.

మకరజ్యోతి దర్శనం సందర్భంగా శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతి దర్శనంతో ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. దీంతో శబరిమలకు భక్తజనం భారీగా తరలివస్తున్నారు. పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. అయితే ఈసారి కరోనా కారణంగా కొవిడ్ నిబంధనలు తప్పనిసరి చేసింది ట్రావెన్‌కోర్ దేవస్థానం.

ఇరుముడులతో వచ్చిన అయ్యప్పలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినా.. పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తున్నారు అధికారులు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టును వెంట తీసుకురావాలని తెలిపారు. మకర సంక్రాంతి పూజలు, మకర జ్యోతి దర్శనం అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తామని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డ్ తెలిపింది.

Tags

Next Story