Mulugu Ramalingeswara Siddhanti: ప్రముఖ జ్యోతిష పండితుడు కన్నుమూత..

Mulugu Ramalingeswara Siddhanti: ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి తుండెపోటుతో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ఆయనను ఆదివారం ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ములుగు సిద్ధాంతిగా ప్రఖ్యాతిగడించిన రామలింగేశ్వర సిద్ధాంతి 30 ఏళ్లుగా జ్యోతీష్య పండితులుగా విశేష సేవలందించారు. రాశిఫలాలతో పాటు, ఆయన చెప్పే జ్యోతిష్యాన్ని దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు విశ్వసిస్తుంటారు. ఎన్నికలు, ప్రకృతివిపత్తులు వంటి పలు అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు తన విశ్లేషణను ప్రజల ముందు ఉంచేవారు.
శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష పండితుడిగా, శ్రీశైలం పీఠాధిపతిగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా జ్యోతిషంలో ఆయన సేవలందిస్తున్నారు. ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికి ముందు ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. సినీ నటులు ఏవీఎస్, బ్రహ్మానందం తదితర కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు.
శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి పూజా హోమాది క్రతువులు నిర్వహిస్తుంటారు విశేష సందర్భాల్లో. ప్రతి ఏడాది ములుగు సిద్ధాంతి అందించే పంచాగ ఫలితాలను లక్షలాది మంది వీక్షించేవారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com