Mumabi Richest Ganapati: ముంబై గణేశ్ బాగా రిచ్.. రూ.316.40 కోట్లకు ఇన్సూరెన్స్..

Mumabi Richest Ganapati: వారం రోజుల్లో గణేష్ పండగ వచ్చేస్తోంది. ఇందుకోసం వివిధ రకాల గణనాధులు సిద్ధమైపోతున్నారు.. భక్తుల చేత పూజలందుకునేందుకు కైలాసం నుంచి భూలోకానికి అప్పుడే పయనమై ఉంటాడు ఆ ఏకదంతుడు. గణనాధులను తమ శక్తి మేర ఏర్పాటు చేస్తుంటారు భక్తులు. ఏ రూపంతో కొలిచినా ఎవ్వరినీ నొప్పించన ఆ బొజ్జగణపయ్య భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధంగా అలంకరించి గణేశుడిపై తమ ఇష్టాన్ని, భక్తిని ప్రదర్శిస్తుంటారు.
ముంబైలోని అత్యంత సంపన్నమైన గణేష్ పండల్ - గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) సేవా మండల్ - ఈ సంవత్సరం గణేష్ చతుర్థి వేడుకల కోసం రికార్డు స్థాయిలో రూ. 316.40 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
మండల్ సెక్యూరిటీ కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్ నుండి బీమాను తీసుకుంది. బంగారం, వెండి ఆభరణాలు మొత్తం కలిపి రూ. 31.97 కోట్లకు రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలోకి వస్తాయి. సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వంట మనుషులు, చెప్పుల దుకాణం ఉద్యోగులు, వాలంటీర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా విలువ రూ.263 కోట్లు.
ఫర్నీచర్, కంప్యూటర్లు, CCTV కెమెరాలు, పాత్రలు, కిరాణా, పండ్లు, కూరగాయలు వంటి ఇతర వస్తువులు, అగ్ని ప్రమాదాలు, భూకంప ప్రమాదాల వంటి వాటి కోసం ప్రత్యేక ప్రమాద పాలసీని తీసుకున్నారు.
"వేదిక ప్రాంగణానికి సంబంధించిన స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీ రూ. 77.5 లక్షల బీమాను అందిస్తుంది. "మా మహా గణపతిని 66 కిలోల కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు, 295 కిలోల వెండి మరియు ఇతర విలువైన వస్తువులతో అలంకరించారు" అని GSB సేవా మండల్ ప్రతినిధి అమిత్ పాయ్ తెలిపారు.
ఆగస్టు 29న 'విరాట్ దర్శనం' వేడుకలో గణేష్ విగ్రహం యొక్క ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com