TTD Calendars Diares 2022: ఆన్‌లైన్‌లో TTD 2022 క్యాలెండర్‌లు, డైరీలు..

TTD Calendars Diaries 2022: TTD క్యాలెండర్లు, డైరీల ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. TTD క్యాలెండర్, డైరీ 2022-23 సంవత్సరాలకుగాను అందుబాటులో ఉన్నాయి.
2022 సంవత్సరానికి సంబంధించిన వివిధ రకాల టిటిడి క్యాలెండర్లు, పంచాగం మరియు డైరీలు ఇప్పుడు తిరుపతి, తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టిటిడి సమాచార కౌంటర్లు, టిటిడి ఈ-దర్శన్ కౌంటర్లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. 2022 సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను శ్రీవారి ఆలయంలో ఆగస్టులో జరిగిన కార్యక్రమంలో టిటిడి బోర్డు అధికారికంగా విడుదల చేసింది.
TTD డైరీ, క్యాలెండర్లు ధర:
TTD పెద్ద సైజు డైరీలు - 150 రూపాయలు
టీటీడీ చిన్న సైజు డైరీలు - 120 రూపాయలు
TTD క్యాలెండర్లు: 130 రూపాయలు
TTD టేబుల్ టాప్ క్యాలెండర్‌లు (12 షీట్): 75 రూపాయలు
TTD క్యాలెండర్ మరియు డైరీలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో ఉన్న సమాచారం కారణంగా భారీ డిమాండ్ ఉంటుంది. అమ్మకాలు కూడావేగంగా పెరిగాయి.
ఆన్‌లైన్లో క్యాలెండర్, డైరీల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
లింక్: https://tirupatibalaji.ap.gov.in/#/diaryCalPanch
టిటిడి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2022వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టిటిడి వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఆన్‌లైన్ సర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. టిటిడికి చెందిన tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో "పబ్లికేషన్స్"ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి పోస్ట్ ద్వారా వారి తెలిపిన అడ్రస్‌కుపంపుతారు. భక్తులు ఎన్ని క్యాలెండర్లు, డైరీలనైనా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి ప్యాకింగ్, షిప్పింగ్ ఛార్జీలు అదనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com