Perumal Templeపెరుమాళ్ ఆలయం.. పెళ్లి కాని యువతీ యువకులు స్వామిని దర్శించుకుంటే..

ఎన్ని సంబంధాలూ చూసినా ఒక్కటీ నచ్చట్లేదు.. పెళ్లి ఘడియ ఎప్పుడు వస్తుందో అని ఇంట్లో పెద్ద వాళ్లు ఎదిగిన పిల్లల గురించి ఆందోళన చెందుతుంటారు. చెన్నై శివారులోని చెంగల్పట్టు జిల్లా పరిధిలో తిరువిడందైలో నిత్య కళ్యాణ స్వామిగా ప్రసిద్ధి చెందిన పెరుమాల్ ఆలయం ఒకటి ఉంది. ఇక్కడకు తమిళనాడు ప్రాంత ప్రజలే కాక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో లక్ష్మీ వరాహా పెరుమాళ్ మూలవిరాట్టుగా ఉన్నారు.
ఆలయానికి వచ్చే భక్తులు రెండు పూలమాలలు స్వామికి సమర్పించాలి. వివాహం ఆలస్యం అవుతుందని భావించి వచ్చిన భక్తులకు గోత్రనామాలతో పూజారి పూజ చేయిస్తారు. పూజానంతరం ఓ మాలను పూజారి భక్తుల మెడలో వేస్తారు. ఆ మాల ధరించి గుడిచుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. తర్వాత కోమలవల్లి అమ్మవారిని దర్శించుకుని కుంకుమను తీసుకోవాలి. ఇలా చేసినట్లైతే మూడు నుంచి ఆరు నెలల్లో పెళ్లవుతుందని భక్తుల విశ్వాసం. ఇలా పెళ్లి చేసుకున్న అనేక మంది దంపతులు వివాహానంతరం మళ్లీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ విధంగా ఏడాది పొడవునా స్వామి వారికి కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. భక్తులకు పెరుమాళ్ స్వామి నిత్యం బుగ్గ చుక్కతో దర్శనమిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com