రెండు రోజుల రాఖీ పండుగ.. ఇంతకీ సోదరుడికి రాఖీ ఎప్పుడు కట్టాలి

రెండు రోజుల రాఖీ పండుగ.. ఇంతకీ సోదరుడికి రాఖీ ఎప్పుడు కట్టాలి
హిందువుల పండుగలలో రక్షా బంధన్ ముఖ్యమైనది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా హిందూ ప్రజలందరూ జరుపుకుంటారు.

హిందువుల పండుగలలో రక్షా బంధన్ ముఖ్యమైనది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా హిందూ ప్రజలందరూ జరుపుకుంటారు. అన్నా, చెల్లెళ్ల ఆత్మయతకు రాఖీ పండుగ అద్దం పడుతుంది. సోదరునికి ప్రేమతో రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. అన్ని వేళలా అండగా ఉంటానని సోదరికి వాగ్ధానం చేస్తాడు. ఆమెకు కొండంత భరోసా ఇస్తాడు సోదరుడు.

నాన్న తరువాత నాన్నంతటి వాడు సోదరుడు అని ఆమె భావిస్తుంది. ఏది చేయాలన్నా సోదరునికి చెప్పాలనుకుంటుంది. ఆయన అనుమతి తీసుకుంటే ఇక ఆ పనిలో ఆటంకాలు ఉండవని భావిస్తుంది. మన బంధం కలకాలం ఇలానే ఉండాలనే కట్టే రాఖీ వారి ప్రేమ, ఆప్యాయతలకు చిరునామాగా నిలుస్తుంది.

ప్రతి సంవత్సరం రక్షా బంధన్ తేదీ హిందూ క్యాలెండర్ ప్రకారం మారుతూ ఉంటుంది. రక్షా బంధన్ యొక్క ఈ పవిత్రమైన రోజున శ్రావణ మాసం పూర్ణిమ తిథిని జరుపుకుంటారు. రక్షా బంధన్ ఆనందాన్ని పంచుకునే పండుగ, ప్రతి సోదరీ శుభ సమయంలో తమ సోదరుడికి రాఖీ కట్టాలని కోరుకుంటారు. రాఖీ కట్టడానికి సరైన సమయం ఎప్పుడు అని చాలా మందికి సందేహం తలెత్తుతుంది.

పూర్ణిమ తిథి ఆగస్టు 30, 2023న ఉదయం 10:45 గంటలకు ప్రారంభమవుతుంది. దాదాపు అదే సమయంలో భద్ర కూడా ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుంది. భద్ర రాత్రి 09:03 గంటలకు ముగుస్తుంది. భద్ర సమయం రాఖీ కట్టడం అననుకూలంగా భావిస్తారు. భద్ర సమయంలో ప్రజలు రాఖీని జరుపుకోలేరు.

పూర్ణిమ తిథి ఆగష్టు 31, 2023 ఉదయం 07:05 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఆ సమయం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రజలు ఆగస్టు 31, 2023న రాఖీన పండుగను జరుపుకోవచ్చు. ఈ పండుగను ఆగస్టు 30, 2023న రాత్రి 09:00 గంటల తర్వాత జరుపుకోవచ్చు లేదా ఆగస్టు 31, 2023న ఉదయం 07:05 గంటలకు ముందు సోదరునికి రాఖీ కట్టవచ్చు.

పండితులు ఈ పండుగను శుభ సమయంలో జరుపుకోవాలని సూచించారు. రాఖీ అంటే రక్షా సూత్రం. సోదరీమణులందరూ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టేటప్పుడు వారి క్షేమం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. కాబట్టి భద్ర కాలాన్ని జాగ్రత్తగా చూసుకుని ఈ పండుగను ఎంతో వైభవంగా, ఆనందంగా జరుపుకోవాలి.

Tags

Next Story