Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మార్మోగి పోతోన్న శబరిమల

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మార్మోగి పోతోన్న శబరిమల
Sabarimala: కేరళలోని శబరిమల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగి పోతోంది.

Sabarimala: కేరళలోని శబరిమల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగి పోతోంది. స్వామి దర్శనానికి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు కదిలివస్తున్నారు. దిగువన పంబ నుంచి సన్నిధానం వరకూ ఆరు కిలోమీటర్ల మేర క్యూలైన్లు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి.12 గంటల పాటు క్యూలైన్లలో నిలబడితే గాని స్వామి దర్శన భాగ్యం కలగడం లేదు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్షమందికి పైగా భక్తులు దర్శనం కోసం వచ్చారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం కాగా, లక్ష మార్కు దాటడం మాత్రం ఇది రెండోసారి అని అధికారులు చెబుతున్నారు.


రోజురోజుకూ పెరుగుతున్న రద్దీతో ట్రావెన్‌కోర్ బోర్డు చర్యలు చేపట్టింది. రోజుకు 90 వేల మంది భక్తులకే దర్శనం కల్పించాలని నిర్ణయించారు. మరోవైపు భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు. దర్శన సమయం 19 గంటల వరకు పొడిగించారు. దీంతో ఆలయ తలుపులు తెల్లవారు జామున 3 గంటలకు తెరుచుకుంటున్నారు.మధ్యాహ్నం 1.30 నుంచి 3గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నారను. తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11.30 వరకు తెరిచి ఉంచుతున్నారు. రద్దీ రోజుకు పెరుగుతుండడంతో అష్టాభిషేకం, పుష్పాభిషేకం అనే ప్రత్యేక ప్రసాదాలు కూడా పరిమితం చేశారు.


నవంబర్ 17న ప్రారంభమైన 41రోజుల మండల పూజా ఉత్సవాలు డిసెంబర్ 27న ముగుస్తాయి. ఆ తర్వాత వచ్చే నెల 14న ముగిసే మకర విళక్కు పుణ్యక్షేత్రం కోసం మళ్లీ డిసెంబర్ 30న ఆలయాన్ని తెరవనున్నారు. పుణ్యక్షేత్రం 20 జనవరి 2023న మూసివేయడం జరుగుతుంది.గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రతీరోజూ 30వేల మంది భక్తులనే అనుమతించేవారు. ఈసారి ఆ పరిస్థితులులేకపోవడంతో అయ్యప్ప దర్శనానికి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story