వినాయక నిమజ్జనం సమయంలో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...!

వినాయక నిమజ్జనం సమయంలో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...!
మన దేశంలో గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కరోనా కారణంగా చాలా సింపుల్ గా ప్రారంభమయ్యాయి. అంతేకాదు గణేష్ నిమజ్జన వేడుకలు కూడా ఈసారి చాలా జాగ్రత్తగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మన దేశంలో గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కరోనా కారణంగా చాలా సింపుల్ గా ప్రారంభమయ్యాయి. అంతేకాదు గణేష్ నిమజ్జన వేడుకలు కూడా ఈసారి చాలా జాగ్రత్తగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే వేడుకల కన్నా ప్రాణాలు అనేవి చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంతకుముందులా గణేష్ నిమజ్జనం అంటే సామూహికంగా డ్యాన్సులు చేయడం.. డీజే పాటలు పెట్టడం, భారీ స్పీకర్లు పెట్టడం, డ్రమ్స్ వంటి వాటికి అనుమతి లేదు. అయితే ఇప్పటికే కొంతమంది గణేష్ నిమజ్జనాన్ని కూడా పూర్తి చేస్తారు. వారి వారి ప్రాంతాలను బట్టి మూడు రోజులకు, ఐదు రోజులకు, కొంతమంది తొమ్మిది రోజులకు, ఇంకొందరు 11 రోజుల తర్వాత నిమజ్జన వేడుకలను నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా హిందువులతో పాటు ఇతరులు కూడా ఈ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించే అవకాశమే లేదు. ఎందుకంటే కరోనా మహమ్మారి రోజురోజుకు విలయతాండం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనాలను ప్రభుత్వాలు విడుదల చేశాయి. ఈ సందర్భంగా వినాయక నిమజ్జన వేడుకలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మాస్క్, శానిటైజర్ తప్పనిసరి.. ఈసారి గణేష్ నిమజ్జనం ఉత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కును తప్పనిసరిగా ధరించాలి. అలాగే శానిటైజర్ ను ప్రతి రెండు లేదా మూడు గంటలకోసారి చేతులకు రాసుకోవాలి

భౌతిక దూరం మరవొద్దు.. గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో అసలైన విషయం ఇదే. ఈ ఉత్సవాల సందర్భంగా డీజే పాటలు లేదా డ్రమ్స్ పెట్టి ప్రతి ఒక్కరూ సామూహికంగా కలిసి డ్యాన్సులు వేస్తూ.. ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కానీ ఈసారి ఇలాంటి వాటిని జరుపుకోవాల్సిన పరిస్థితి కనబడటం లేదు. అలాగే మీరు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.

నలుగురు మాత్రమే.. సాధారణంగా గణేష్ నిమజ్జనం సమయంలో జరిపే ఊరేగింపులో పదుల సంఖ్యలో లేదా వందలాది మంది ప్రజలు రోడ్లపై గుమిగూడి ఉంటారు. అలాగే వాహనాలలో కూడా పదుల సంఖ్యలో వ్యక్తులు ఉంటారు. కానీ ఈసారి మాత్రం గణేశుని ఊరేగింపు సమయంలో కేవలం నలుగురు లేదా ఐదుగురు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.

టపాసులు కాల్చకండి.. ప్రతి ఏడాది గణేష్ నిమజ్జనం సందర్భంగా, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది దీనికి అవకాశం లేదు. పోలీసులు కూడా బాణసంచా కాల్చడానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ముందుగానే బాణసంచా కొనడం వంటివి చేయకండి. ఒకవేళ వాటిని కొంటే ఇతర సమయాల్లో ఉపయోగించుకోండి.

Read MoreRead Less
Next Story