Sankashti Chaturthi Vrat: సంకష్టి చతుర్థి వ్రత ప్రాముఖ్యం.. ఉపవాసం అత్యంత శక్తివంతం

Sankashti Chaturthi Vrat: సంకష్టి చతుర్థి వ్రత ప్రాముఖ్యం.. ఉపవాసం అత్యంత శక్తివంతం
Sankashti Chaturthi Vrat: సంకష్టి చతుర్థి వ్రతం, పూజలకు సంబంధించిన వివరాలను, ప్రాముఖ్యతను నరసింహ పురాణంలో వివరించబడ్డాయి. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి సంకష్టి చతుర్థి యొక్క సార్థకతను వివరించాడు.

Sankashti Chaturthi Vrat: సంకష్టి చతుర్థి వ్రతం, పూజలకు సంబంధించిన వివరాలను, ప్రాముఖ్యతను నరసింహ పురాణంలో వివరించబడ్డాయి. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి సంకష్టి చతుర్థి యొక్క సార్థకతను వివరించాడు.

సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించే భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వ్రతాన్ని ఆచరించేవారు రోజంతా ఉపవాసం ఉంటారు. సంకష్టి చతుర్థి పూజ సాధారణంగా సాయంత్రం జరుగుతుంది. గణేష్ విగ్రహాన్ని అలంకరించి, తాజా పుష్పాలతో ఏకదంతుడిని అర్చిస్తారు. ఈ సందర్భంగా చేసిన ప్రసాదంలో మోదకం మరియు గణేష్‌కి నచ్చిన పిండివంటలు ఉంటాయి. పూజా సమయంలో వ్రత కథను అత్యంత భక్తి శ్రద్ధలతో చదవాలి. గణేశుడికి సంబంధించిన మంత్రాలు, స్తోత్రాలు తప్పనిసరిగా పఠించాలి.

పూజ అనంతరం చంద్రుని దర్శించి ఉపవాసం ముగించాలి. చంద్రునికి నైవేద్యంగా గంధం, నీరు, బియ్యం, పువ్వులు సమర్పించాలి.

సంకష్టి చతుర్థి ఉపవాస నియమాలు

పూర్తి ఉపవాసం సాధ్యం కానివారు పాలు, పండ్లు తీసుకోవచ్చు.

సంకష్టి చతుర్థి వ్రతం కథ

సంకష్టి చతుర్థికి సంబంధించిన ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. గణేశుడిని నిరంతరం తలచుకోవడం వల్ల ఏనుగు తొండం కలిగిన భృశుండి అనే మహర్షి ఉండేవాడు. అతని భక్తి కారణంగా చాలా శక్తివంతుడు అవుతాడు. ప్రజలు అతనిని సందర్శించి ఆశీస్సులు పొందుతారు. ఒకసారి ఇంద్రుడు ఋషిని దర్శించేందుకు స్వర్గలోకం నుంచి వస్తున్నాడు. అతను రాజు షుర్సేన్ రాజ్యం మీదుగా రుషి దర్శనానికి విచ్చేస్తున్నాడు. రాజ్యంలోని ఒక వ్యక్తి ఇంద్రుడి విమానాన్ని చూడడంతో పుష్పక విమానం తన శక్తిని కోల్పోయి నేలమీద పడుతుంది.

విషయం తెలుసుకున్న రాజు షుర్సేన్ పరుగున వచ్చి ఇంద్రుని ఆశీస్సులు అందుకున్నాడు. రాజ్యంలో ఒక పాపాత్ముడు చూసిన చూపు కారణంగా తన విమానం దాని శక్తిని కోల్పోయిందని, ఏదైనా పుణ్యకార్యం చేయవలసి ఉందని రాజుతో చెబుతాడు ఇంద్రుడు. అంతకు ముందురోజే సంకష్టి చతుర్థి. రాజ్యంలో ఎవరైనా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఉన్నారా అని ఇంద్రుడు రాజుని అడుగుతాడు. వారు తాము పొందిన పుణ్యాన్ని కొంత ఇవ్వగలిగితే, తన విమానం పైకి ఎగురుతుందని చెబుతాడు. సైనికులు రాజ్యాన్ని శోధించి ఎవరూ ఈ వ్రతాన్ని ఆచరించలేదని చెబుతారు.

ఆ సమయంలో, గణేష్ సైనికులు ఆ ఉదయం మరణించిన పాపిని గణేష్ నివాసానికి తీసుకువెళుతున్నారు. ఇంతలో ఇంద్రుడు అది చూసి పాపిని ఎందుకు మోస్తున్నారని అడుగుతాడు. అతడికి కిందటి రోజు (సంకష్టి చతుర్థి) అనారోగ్యం వచ్చిందని, అందుకే ఉదయం చనిపోయేంత వరకు ఏమీ తినలేదని సైనికులు సమాధానమిస్తారు. అనుకోకుండా అతడు ఆరోజు ఉపవాసం చేశాడు. దాంతో తన పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయి. గణేశుని నివాసంలో స్థానం సంపాదించడానికి తగినంత పుణ్యాన్ని పొందాడు అని ఇంద్రుడికి వివరిస్తారు సైనికులు.

ఈ సమయంలో మరణించిన వ్యక్తి శరీరాన్ని తాకిన గాలి ఇంద్రుడి విమానాన్ని తాకుతుంది. దీంతో విమానం పైకి ఎగరడం ప్రారంభించింది. ఈ విధంగా, సంకష్టి చతుర్థిని ఆచరించడం వల్ల కలిగే పుణ్యాలు అపారమైనవి అని పురాణాల్లో చెప్పబడింది.

సంకష్టి చతుర్థి ప్రయోజనాలు

సంకష్టి చతుర్థి అంటే అన్ని కష్టాలు, అడ్డంకులను తొలగించే రోజు అని అర్థం. ఈ రోజున ఆచరించిన వ్రతం ఎంతో విశిష్టమైనదని భక్తులు విశ్వసిస్తారు. భక్తితో వ్రతాన్ని ఆచరిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story