శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు!

శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మహాగణపతి, చండీశ్వర పూజల అనంతరం కంకణధారణ, వాస్తుపూజ, వాస్తు హోమాలు నిర్వహించారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేపట్టారు.
ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ గావించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు విశేష పూజలు చేశారు. బ్రహ్మ, విష్ణులతోపాటు సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించారు.
శ్రీశైల క్షేత్రంలో ఏడు రోజులపాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బృంగి వాహనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.. కరోనా కారణంగా గ్రామోత్సవం రద్దు చేయగా.. ఆలయ వీధుల్లో ఉత్సవాన్ని నిర్వహించనున్నారు అర్చకులు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com