శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపట్నుంచి సర్వ దర్శనం టికెట్లు జారీ..!

శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపట్నుంచి సర్వ దర్శనం టికెట్లు జారీ..!
Tirumala Sarvadharshan : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించిన దేవస్థానం..

Tirumala Sarvadharshan : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించిన దేవస్థానం... రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తునట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టోకెన్లు జారీని పరిమితం చేయనున్నట్లు టీటీడీ వివరించింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 11వ నుంచి సర్వదర్శనం టికెట్లను తాత్కాలికంగా నిలిపివేసిన టీటీడీ.. అప్పటి నుంచి కేవలం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తూ వచ్చింది. అయితే గత ఐదు నెలలుగా సామాన్య భక్తుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు.. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేసేందుకు ఏర్పాటు చేశారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో మొదట దశగా చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మంగా టోకెన్లు టీటీడీ జారీ చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story