Horoscope Today: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.42| సూర్యాస్తమయం సా.6.31| తిథి శు. ద్వాదశి ప.3.53 వరకు తదుపరి త్రయోదశి| నక్షత్రం |రాహుకాలం ప. 1.30 నుంచి 03.00 వరకు| యమగండం ఉ 6.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం ఉ.1.33 నుంచి 3.18 వరకు| దుర్ముహూర్తం ప.09.58 నుంచి 10.47వరకు | శుభసమయం ఉ.07.00 ని.
ఈ రోజు రాశి ఫలాలు
మేషం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి.
వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆశించిన రాబడి కనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు శుభవార్తలు.
మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. బంధువులతో అకారణ వైరం. అంచనాలు తారుమారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు మరింత పనిభారం. పారిశ్రామికవర్గాలకు సమస్యలు ఎదురవుతాయి.
కర్కాటకం: ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు ఉండవచ్చు. నేత్ర సంబంధిత రుగ్మతలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కుతాయి.
కన్య: .ప్రత్యర్థులు సైతం స్నేహితులుగా మారతారు. భూములు, స్థలాలు కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.
తుల: రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల సంబంధించిన చికాకులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు. కళాకారులకు చికాకులు.
వృశ్చికం: అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. భూ వివాదాలు నెలకొంటాయి. రాబడి కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు చికాకులు.
ధనుస్సు: నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దేవాలయ దర్శనాలు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
మకరం: కుటుంబ సమస్యలు. దూరప్రయాణాలు. స్నేహితులతో విభేదాలు. అనారోగ్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులకు మార్పులు.
కుంభం: ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత హోధాలు.
మీనం: కార్యక్రమాలలో అవాంతరాలు. ఆస్తి విషయాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com