శివుని ధ్యానిస్తూ, శ్వాసని గమనిస్తూ.. శక్తి వంతం పౌర్ణమి ధ్యానం

శివుని ధ్యానిస్తూ, శ్వాసని గమనిస్తూ.. శక్తి వంతం పౌర్ణమి ధ్యానం
పవిత్రమైన కార్తీకమాసం శివుడిని ఆరాధించే ప్రత్యేక మాసం.

పవిత్రమైన కార్తీకమాసం శివుడిని ఆరాధించే ప్రత్యేక మాసం. మంచి ఆరోగ్యం, మానసిక సమతుల్యత, ధ్యానం, పరమ శివుని అనుగ్రహం పొందడానికి అనుకూలమైన మాసం. కార్తీకమాసంలో తెల్లవారుజామున నిద్ర లేచి ధ్యానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా పవిత్రమైన బ్రాహ్మీ ముహుర్త సమయంలో (3.30 నుంచి 4.00 మధ్య )ధ్యానం చేయడం మంచిది. ఆ సమయంలో వాతావరణం ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

సోమవారం పరమశివుని ఆరాధించడానికి పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు సాధన చేయడానికి మరింత ముఖ్యమైన రోజులు. ఈ సంవత్సరం 2023లో కార్తీక మాసానికి సోమవారాలు నవంబర్ 20, 27, డిసెంబరు 4 మరియు 11వ తేదీలలో ఉంటాయి. సోమవారం చంద్రుని రోజు. తెలుపు చంద్రుని సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించి ధ్యానానికి ఉపక్రమిస్తే మంచిది.

ప్రత్యేకించి ఈ పవిత్రమైన రోజులలో ధ్యానం చేయడం, భజనలు పాడడం, గురు మంత్రాన్ని పఠించడం చేయవచ్చు. శివ పంచాక్షరి మంత్రం ("ఓం నమః శివాయ") లేదా శివ-శక్తి పంచాక్షరీ మంత్రం ("ఓం హ్రీం నమః శివాయ") 108 లేదా 1008 సార్లు జపించవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా నయం చేయడానికి శ్రీ మృత్యుంజయ మంత్రాన్ని జపించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. వీలైతే, మౌనం పాటించడం, ఉపవాసం చేయడం లేదా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

శివలింగం ఉన్నవారు నీరు, పువ్వులు, విభూతి, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార లేదా తేనె సమర్పించి పూజ చేయాలి. "ఓం నమః శివాయ మంత్రాన్ని జపించేటప్పుడు నైవేద్యాలను శివలింగంపై (స్వచ్ఛమైన పూజ చెంచా ఉపయోగించి మాత్రమే) వేయవచ్చు.

రుద్రం ఎలా పఠించాలో మీకు తెలిస్తే, కార్తీక మాసంలో సాయంత్రం చేసే రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది. మీ ఉచ్వాస, నిశ్వాసలను గమనిస్తూ ఆలోచనా రహిత స్థితిలో ఉండడమే ధ్యానం. ధ్యానంతో అనేక అనారోగ్యాలను దూరం చేయవచ్చని చెబుతారు. ప్రయత్నించి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story